Headlines

ఇవాళ్టి కేంద్ర జలశక్తి సమావేశంపై సస్పెన్స్..

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య నీటి పంపకాలపై మరోసారి వివాదం రాజుకుంది. బుధవారం నాడు కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరుగనున్న కీలక సమావేశంపై తుది నిమిషంలో సస్పెన్స్ నెలకొంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆహ్వానించారు.కేంద్రం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్ట్‌ను ముఖ్యంగా చర్చించాలని ఎజెండాలో పేర్కొనగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీనికి తలకిందులుగా స్పందించింది. బనకచర్లపై చర్చ అవసరం లేదంటూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. మిగతా జలవివాదాలపై చర్చ జరిగితేనే సమావేశానికి హాజరవుతామన్న అభిప్రాయాన్ని వెల్లడించింది.తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా చెప్పిన విషయం ఏమిటంటే – పాలమూరు-రంగారెడ్డి, డిండీ, తుమ్మిడిహెట్టి, ఇచ్చంపల్లి వంటి ప్రాజెక్టులపై అనుమతుల విషయంలో చర్చ జరగాలి. బనకచర్ల అంశం ఏకపక్ష నిర్ణయంగా భావిస్తున్నట్లు తెలంగాణ వర్గాలు చెబుతున్నాయి.ఇదే సమయంలో, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం బనకచర్ల ప్రాజెక్ట్‌ ద్వారా గోదావరి వరదనీటిని వినియోగించాలనే లక్ష్యంతో ముందడుగు వేసిందని పేర్కొంటోంది. ఇది తమ రాష్ట్రానికి కీలకమని చెబుతూ సమావేశంలో పూర్తి స్థాయిలో పాల్గొనబోతున్నట్లు స్పష్టం చేసింది.ఈ పరిణామాల మధ్య, కేంద్రం సమావేశానికి సంబంధించి ఏజెండా మారుతుందా? లేదా తెలంగాణ సమావేశానికి హాజరవుతుందా? అన్న విషయాలపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. దీంతో బుధవారం మధ్యాహ్నం 2:30 గంటలకు జరగబోయే ఈ భేటీపై ఉత్కంఠ నెలకొంది.

Please follow and like us:
Pin Share