


దేవరకొండ, T6 న్యూస్: దేవరకొండ మండలంలోని ముదిగొండ కమలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను RDO రమణా రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్హాస్టల్ మరియు పాఠశాల పరిసరాలు,తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని,విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు.పాఠశాల పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.పాఠశాల ఆవరణంలో పిచ్చి మొక్కలు తొలగించాలని, పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు.విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని, వాటిని సాధించే దిశగా కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో RDO రమణా రెడ్డి, ఎంపిడిఓ డానియల్, సిఐ నరసింహులు,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్, యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ, విద్యార్థులు, ఉపాద్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

