హైదరాబాద్, జూలై 14:ఐటీ సెక్టార్‌ను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్న మాదకద్రవ్య ముఠాపై నార్కోటిక్ విభాగం భారీ డెకాయ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ నెల 12న నిర్వహించిన గుప్త ఆపరేషన్‌లో నిందితుడి సెల్‌ఫోన్ లభ్యం కావడంతో కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడి ఫోన్‌లో 100 మందికి పైగా గంజాయి వినియోగదారుల వివరాలు ఉన్నట్లు వెల్లడైంది.ఎస్పీ చెన్నూరి రూపేష్ వెల్లడించిన వివరాల ప్రకారం –వారానికి ఒకసారి “సందీప్” అనే వ్యక్తి ఐటీ కార్యాలయాల సమీపానికి వచ్చి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. అతను వాట్సాప్‌లో “బచ్చా ఆగయా” అనే సంకేత మెసేజ్ పంపేవాడు. ఈ సంకేతం చూసిన వినియోగదారులు అతనిని సంప్రదించి గంజాయి కొనేవారు.ఈ సమాచారంతో పోలీసులు నిందితుడి ఫోన్ నుంచే అదే సంకేతం పంపించి వల పన్నారు. ఫలితంగా 14 మంది వినియోగదారులు, ఒక మహిళ సహా అక్కడకు వచ్చారు. వారందరినీ అదుపులోకి తీసుకొని డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా, అందరికీ పాజిటివ్ వచ్చినట్లు ఎస్పీ తెలిపారు.ఎస్పీ చెన్నూరి రూపేష్ వెల్లడించిన వివరాలు:మేము పంపిన మెసేజ్‌కి స్పందించి వచ్చినవారు: 14వారిలో ఒక మహిళ ఉందిటెస్టుల్లో అందరికీ గంజాయి వినియోగించినట్లు తేలిందిపాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరిపైనా కేసులు నమోదు చేస్తాంసెల్‌ఫోన్‌లో ఉన్న ఇతర కాంటాక్టుల ఆధారంగా మరిన్ని అరెస్టులు ఉండొచ్చుపోలీసుల హెచ్చరిక:డ్రగ్స్ వినియోగం, కలిగించే నష్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ అన్నారు. గంజాయి తీసుకోవడం కేవలం నేరమే కాదు, ఆరోగ్యానికి ముప్పు అని హెచ్చరించారు. డ్రగ్స్‌కు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

