Headlines

జుక్కల్ ఎమ్మెల్యే కూతురు గ్రాడ్యుయేషన్ పార్టీకి హాజరైన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో కలిసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

హైదరాబాద్:
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంత రావు కూతురు జసింత తోట ప్రముఖ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు.

ఆదివారం నాడు బంజారాహిల్స్ లో ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్ పార్టీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తోట జసింత ను డిప్యూటీ సీఎం భట్టి,మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అభినందించారు. మరిన్ని ఉన్నత చదువులతో సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని వారు జసింతకు శుభాకాంక్షలు తెలిపి,ఆశీర్వదించారు.

Please follow and like us:
Pin Share