Headlines

శంకరమఠంలో సిఎం ప్రత్యేక పూజలు..

హైదరాబాద్: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ నల్లకుంటలోని శంకరమఠంలో గణపతి, శారదాంబ, చంద్రమౌళీశ్వర స్వామి, ఆదిశంకరాచార్యుల ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శంకరమఠంలో శృంగేరి శారదా పీఠం జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీతీర్థ మహాస్వామి వారిని మర్యాద పూర్వకంగా కలిశారు.

“ధర్మ విజయ యాత్ర” లో భాగంగా హైదరాబాద్‌కు విచ్చేసిన శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీస్వామి వారికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను తెలియజేశారు. ముఖ్యమంత్రి వెంట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.

Please follow and like us:
Pin Share