Headlines

ఘనంగా జరిగిన ధన్వంతరి జయంతి ఉత్సవం

హైదరాబాద్: మన కమ్యూనిటీకి చెందిన ముఖ్యమంత్రి జన నాయక్ కర్పూరి ఠాకూర్ కు భారతరత్న రావడం ఆయన కృషికి నిదర్శనం, భారత వ్యవస్థకు ఆదర్శప్రాయమైన రిజర్వేషన్ అమలుకు ఆయన ఎంతో కృషి చేశారు, ముఖ్యంగా బీసీలకు మన కమ్యూనిటీ వారికి. ఇట్లాగే మన కమ్యూనిటీ వాళ్లు ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నారు. మన కమ్యూనిటీకి చెందిన రికోసేన్, కుల్దీప్ సింగ్ మొదలైన వారు జాతీయ క్రికెట్ లో రాణిస్తూ మన కమ్యూనిటీ పేరు నిలబెడుతున్నారు. ఇలాగే పార్లమెంటు దగ్గర ప్రధానమంత్రి సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారి సంజయ్ సేన్ మన కమ్యూనిటీ వాడు అని గర్వంగా చెప్పుకోవచ్చు. వీరందరినీ చూస్తుంటే ప్రస్తుతం మన కమ్యూనిటీ వాళ్లు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. ఉదాహరణకి నన్నే తీసుకోండి. చత్తీస్గడ్ లోని వైశాలి నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను అని అన్నారు ముఖ్యఅతిథిగా హాజరైన రికేష్ సీన్.

ఆదివారం (26-10-2025) నాడు జరిగిన సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ధన్వంతరి పరివార్ (నాయి బ్రాహ్మణ)సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన శ్రీ ధన్వంతరి జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై మన కమ్యూనిటీ వారందరం ఐక్యమైతేనే అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుందని, తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఒక కంట్రోలర్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు శ్రీ రికేష్ సేన్.

ఈ సంస్థ స్థాపక అధ్యక్షులు డా. ఎస్. సారంగపాణి మాట్లాడుతూ కమ్యూనిటీ వాళ్ళం అన్ని రంగాల్లో ప్రస్తుతం ఎదుగుతున్నామని, ఆత్మాన్యునతకు గురి కాకుండా ఆత్మస్థైర్యంగా బ్రతకాలని, అప్పుడే మనం ఎదుగుతామని మన కుల అధిదేవత ధన్వంతరి అని, మన కుల వృత్తుల్లో భాగమైన క్షవుర వృత్తి, మంత్రసాని ఇవన్నీ కూడా వైద్య రంగ అనుబంధం కిందకే వస్తాయని అన్నారు.

దేవరకొండ సైదులు ప్రసంగిస్తూ వచ్చేనెల ఖమ్మంలో జరగబోయే కార్యక్రమాలను తెలియజేస్తూనే కరోనాకాలంలో తాము చేసిన సేవలను గుర్తు చేస్తూ రోహిణి కమిషన్ కు తాము అందించిన మన కులానికి సంబంధించిన సమాచారాన్ని తెలిపారు.

విశ్రాంత సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ దుగ్యాల అశోక్ గారు మాట్లాడుతూ వచ్చేనెల మన కులం ఏర్పాటు చేసే వనభోజనాలు ఖమ్మంలో దానికి మనవాళ్లు పెద్ద ఎత్తున హాజరవ్వాలని అక్కడ జననాయక్ కర్పూరి ఠాకూర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్టు తెలిపారు.

విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ మదన్మోహన్ మాట్లాడుతూ ఈ వేదిక పైన వైద్యులతో పాటు ఉపాధ్యాయులను కూడా ఈ సంవత్సరం నుంచి సన్మానిస్తున్నట్టు తెలిపారు. యాదవులకు శ్రీకృష్ణుడు కులదైవంగా ఉన్నట్టుగానే మన కులానికి ధన్వంతరి ఉన్నాడని తెలిపారు. మనం తలదించుకుంటే మన తలను తొక్కుకుంటూ వెళ్లిపోతారు, అదే తలను ఎత్తి ఉంటే భయపడతారు కాబట్టి మనం ఆత్మన్యూనతను వదిలి ఆత్మస్థైయంతో ఎదగాలని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ రుద్రకోటి సదాశివం ప్రసంగిస్తూ ఇటీవల గోవాలో మన కమ్యూనిటీ కి సంబంధించిన సమావేశం ఘనంగా జరిగిందని గుర్తు చేస్తూ, ఆంధ్రప్రదేశ్లో సెలూన్లకు 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఇంకా దేవాలయాల్లో బోర్డు సభ్యులుగా మన నాయి బ్రాహ్మణ కులానికి చెందిన వారిని కూడా ఒకరిని నియమించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూనుకొని దాదాపు అన్ని గుళ్ళలో నియమించింది అని ఇదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో ఉండాలని తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

విశ్రాంత మెడికల్ అధికారి శ్రీ జి ఎస్ శ్రీహరి రావు సభకు అధ్యక్షత వహించి స్వాగత ఉపన్యాసం చేశారు. ఇంకా ఈ సభలో ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ ఆచార్యులు ఆచార్య ఎం. బాగయ్య, ఎల్. రాంబాబు, మున్ని ప్రసాద్, జి ప్రభాకర, ప్రముఖ కార్టునిస్ట్ నారు, ఎం. గోపాల కృష్ణ, ఎ. సుధాకర్, మొదలైన వారు పాల్గొన్నారు.

నాదస్వరం తో ప్రారంభమైన ఈ సభలో పి. గ్రీష్మ, మైత్రి మొహర్, సృజన, నిఖిల మొదలైన పిల్లలు శాస్త్రీయ నృత్యం చేశారు. బ్రహ్మ తేజ, వరివేటి సుభామతి మొదలైన వాళ్లు పాటలు పాడారు. ధృతి మంజీరా, లాస్య ఫ్లోట్ వాయించి సభను అలరించారు.

ఈ సభలో నాయి బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన 90 ఏళ్ల వృద్ధుడు శ్రీ కంది సూర్యనారాయణకు జీవన సాఫల్య సన్మానం చేయడం జరిగింది. ఇంకా వైద్య విద్యార్థులను, వైద్య ఉద్యోగస్తులను, ఉపాధ్యాయ రంగంలో పనిచేస్తున్న వారిని, జర్నలిస్టులను ఇంకా తదితర పలు రంగాల్లో పనిచేస్తున్న ప్రముఖులను సన్మానించడం జరిగింది . ఈ సభకు కుమారి ప్రేరణ యాంకరింగ్ చక్కగా అలరించింది.

Please follow and like us:
Pin Share