
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ డిపోల్లో ఎక్కడికక్కడ బస్సులను బీసీ సంఘాల నేతలు అడ్డుకున్నారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోరుతూ బంద్ నిర్వహిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేపట్టిన బీసీ సంఘాల సమాఖ్య
- రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేపట్టిన బీసీ సంఘాల సమాఖ్య
- ఆర్టీసీ డిపోల్లో ఎక్కడికక్కడ బస్సులను అడ్డుకుంటున్న బీసీ సంఘాలు
- జిల్లా కేంద్రాల్లోని ఆర్టీసీ డిపోల ముందు బీసీ సంఘాల ఆందోళన
- మహబూబ్‌నగర్ ఆర్టీసీ డిపో ముందు ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- వికారాబాద్, నిజామాబాద్, గద్వాల ఆర్టీసీ డిపోల ముందు ఆందోళన
- నాగర్‌కర్నూల్, వనపర్తి ఆర్టీసీ డిపోల ముందు వివిధ పార్టీల ధర్నా
- షాద్ నగర్ ఆర్టీసీ బస్టాండ్ లో ఉదయం 4 గంటల నుండి కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి బంద్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
సాయంత్రం 5 వరకు బంద్ కొనసాగుతుందన్న బీసీ ఐకాస నేతలు
- ఆర్టీసీ డిపోల్లో ఎక్కడికక్కడ బస్సులను అడ్డుకుంటున్న బీసీ సంఘాలు
- జిల్లా కేంద్రాల్లోని ఆర్టీసీ డిపోల ముందు బీసీ సంఘాల ఆందోళన
- స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు కోరుతూ బంద్
- రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి చట్ట సవరణ చేయాలని డిమాండ్
- బీసీ సంఘాల బంద్‌కు సంఘీభావం ప్రకటించిన అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు
- బీసీ బంద్‌కు మద్దతుగా పలు చోట్ల బీసీ సంఘాల నిరసన
- అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్
- బంద్‌కు అధికార కాంగ్రెస్‌తో పాటు మద్దతు తెలిపిన బీజేపీ, బీఆర్ఎస్
- బంద్‌కు మద్దతు తెలిపిన సీపీఐ, సీపీఎం, టీజేఎస్, సీపీఐఎంఎల్
- బంద్‌కు ఎంఆర్పీఎస్, మాలమహానాడు, ఆదివాసీ, గిరిజన సంఘాల మద్దతు
- బీసీ బంద్‌కు మైనార్టీ, విద్యార్థి, ప్రజాసంఘాల మద్దతు
- ఆర్టీసీ బస్సులు బయటకురాకుండా డిపోల ముందు ఐకాస నేతల నిరసన
- బంద్‌లో పాల్గొని మద్దతు తెలుపుతున్న దుకాణాలు, వ్యాపార సంస్థలు
- రాష్ట్ర ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరిన బీసీ ఐకాస నేతలు
- మద్దతు తెలిపిన ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు
- బంద్ నుంచి అంబులెన్సులు, ఆసుపత్రులు, అత్యవసర సర్వీసులకు మినహాయింపు
- నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతామన్న బీసీ ఉద్యోగుల సంఘాలు
- సాయంత్రం 5 వరకు బంద్ కొనసాగుతుందన్న బీసీ ఐకాస నేతలు

