Headlines

కొనసాగుతోన్న బంద్​… హైదరాబాద్​లో నిలిచిపోయిన ఆర్టీసీ సేవలు

రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ బంద్​ కొనసాగుతోంది. ఆర్టీసీ డిపోల్లో ఎక్కడికక్కడ బస్సులను బీసీ సంఘాల నేతలు అడ్డుకున్నారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోరుతూ బంద్​ నిర్వహిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ చేపట్టిన బీసీ సంఘాల సమాఖ్య

  • రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ చేపట్టిన బీసీ సంఘాల సమాఖ్య
  • ఆర్టీసీ డిపోల్లో ఎక్కడికక్కడ బస్సులను అడ్డుకుంటున్న బీసీ సంఘాలు
  • జిల్లా కేంద్రాల్లోని ఆర్టీసీ డిపోల ముందు బీసీ సంఘాల ఆందోళన
  • మహబూబ్‌నగర్ ఆర్టీసీ డిపో ముందు ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
  • వికారాబాద్, నిజామాబాద్‌, గద్వాల ఆర్టీసీ డిపోల ముందు ఆందోళన
  • నాగర్‌కర్నూల్, వనపర్తి ఆర్టీసీ డిపోల ముందు వివిధ పార్టీల ధర్నా
  • షాద్ నగర్ ఆర్టీసీ బస్టాండ్ లో ఉదయం 4 గంటల నుండి కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి బంద్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

సాయంత్రం 5 వరకు బంద్‌ కొనసాగుతుందన్న బీసీ ఐకాస నేతలు

  • ఆర్టీసీ డిపోల్లో ఎక్కడికక్కడ బస్సులను అడ్డుకుంటున్న బీసీ సంఘాలు
  • జిల్లా కేంద్రాల్లోని ఆర్టీసీ డిపోల ముందు బీసీ సంఘాల ఆందోళన
  • స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు కోరుతూ బంద్
  • రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి చట్ట సవరణ చేయాలని డిమాండ్
  • బీసీ సంఘాల బంద్‌కు సంఘీభావం ప్రకటించిన అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు
  • బీసీ బంద్‌కు మద్దతుగా పలు చోట్ల బీసీ సంఘాల నిరసన
  • అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్‌
  • బంద్‌కు అధికార కాంగ్రెస్‌తో పాటు మద్దతు తెలిపిన బీజేపీ, బీఆర్‌ఎస్
  • బంద్‌కు మద్దతు తెలిపిన సీపీఐ, సీపీఎం, టీజేఎస్, సీపీఐఎంఎల్‌
  • బంద్‌కు ఎంఆర్‌పీఎస్‌, మాలమహానాడు, ఆదివాసీ, గిరిజన సంఘాల మద్దతు
  • బీసీ బంద్‌కు మైనార్టీ, విద్యార్థి, ప్రజాసంఘాల మద్దతు
  • ఆర్టీసీ బస్సులు బయటకురాకుండా డిపోల ముందు ఐకాస నేతల నిరసన
  • బంద్‌లో పాల్గొని మద్దతు తెలుపుతున్న దుకాణాలు, వ్యాపార సంస్థలు
  • రాష్ట్ర ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరిన బీసీ ఐకాస నేతలు
  • మద్దతు తెలిపిన ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు
  • బంద్‌ నుంచి అంబులెన్సులు, ఆసుపత్రులు, అత్యవసర సర్వీసులకు మినహాయింపు
  • నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతామన్న బీసీ ఉద్యోగుల సంఘాలు
  • సాయంత్రం 5 వరకు బంద్‌ కొనసాగుతుందన్న బీసీ ఐకాస నేతలు
Please follow and like us:
Pin Share