Headlines

జెండాలు మోయడమే కాదు..ఎజెండాలు చేయడం కూడా తెలుసు.!

78 ఏండ్ల నుండి రాజ్యాధికారానికి దూరంగా బీసీలు.!

రిజర్వేషన్ల పేరుతో బీసీలను విడదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.!

రాబోయే మూడేళ్లలో బీసీలదే రాజ్యాధికారం

వందమందికి పైగా పార్టీలో చేరిన సభ్యులు

టిఆర్పి అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెల్లడి.!

షాద్ నగర్, అక్టోబర్ 15: రిజర్వేషన్ల పేరుతో బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం విడదీస్తూ మోసం చేస్తుందని మండిపడ్డారు టిఆర్పి అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న…బుధవారం షాద్‌నగర్ పట్టణంలోని హోటల్ గోదావరి సమీపంలో బీసీ మహాసభ రంగారెడ్డి జిల్లా యువత విభాగం అధ్యక్షుడు శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ ఆత్మగౌరవ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఇందులో భాగంగా బీసీ మహాసభ రంగారెడ్డి జిల్లా యువత విభాగం అధ్యక్షుడు శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో వందమందికి పైగా కొత్త సభ్యులు టిఆర్పి పార్టీలో చేరారు.మల్లన్న వారిని కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్బంగా మల్లన్న మాట్లాడుతూ,,,బీసీ ఐక్యతా స్ఫూర్తి మరింత బలపడుతోందని అన్నారు. బీసీల చైతన్యమే భవిష్యత్తు రాజకీయ దిశను నిర్ణయిస్తుందని అన్నారు.బీసీల ఆత్మగౌరవం,రిజర్వేషన్లు,రాజ్యాధికారం కోసం పోరాడే పార్టీగా టిఆర్పి రూపొందిందని తెలిపారు.78 ఏళ్ల పరిపాలనలో బీసీలు రాజాధికారానికి దూరంగా ఉంచబడ్డారు. కానీ,ఇక పరిస్థితులు మారాయన్నారు.

గ్రామ స్థాయిలోనుంచి రాష్ట్ర స్థాయివరకు బీసీలు చైతన్యవంతంగా ఐక్యమవుతున్నారు.రాబోయే మూడేళ్లలో తెలంగాణలో బీసీలదే రాజ్యాధికారం స్పష్టం చేశారు.తాను నేతృత్వం వహిస్తున్న టిఆర్పి పార్టీ బీసీల హక్కుల కోసం కడపటి దాకా పోరాడుతుందని మల్లన్న స్పష్టం చేశారు.బడుగు బలహీన ప్రజల హక్కుల కోసం నిలబడుతుంది.ఈ పోరాటం కేవలం రాజకీయమే కాదు.సామాజిక సమానత్వం కోసం కూడా అని ఆయన తెలిపారు.తెలంగాణ రాజ్యాధికార పార్టీ వైపు బీసీలు ముగ్గు చూపుతున్నారని,78 ఏళ్లకాలంలో అగ్రవర్ణ కులాల బిసి సమాజాన్ని మోసం చేస్తున్న తీరును పసిగట్టారని,చరిత్రలో వివిధ పార్టీల జెండాలు మోశామని అన్నారు.కానీ,ప్రస్తుతం బీసీ ల జెండాలు మోస్తున్నామని తెలిపారు.రాబోయే మూడేళ్ల కాలంలో ముఖ్యమంత్రి సీటు అధిరోహించి అసెంబ్లీ,మండలి,కార్పొరేషన్ సీట్లు సాధించి పదిలం చేసుకుంటామని, అగ్రవర్ణ కులాలు తమపై కుట్రలు కుతంత్రాలు చేస్తే, బిసిల హక్కులు కాలరాస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.

అనంతరం శ్రీధర్ వర్మ మాట్లాడుతూ… బీసీల చైతన్యం కోసం గ్రామ గ్రామాలలో కార్యచరణ రూపొందించి,రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్పి నాయకులు నీరాటి ఆంజనేయులు,గుడాల గిరిబాబు , జనార్దన్, రంగారెడ్డి జిల్లా బీసీ మహాసభ యువత అధ్యక్షులు శ్రీధర్ వర్మ, సోలిపేట శంకర్ ముదిరాజ్,నర్సింలు,గణేష్, యాదగిరి, రవి, శేఖర్,కూతలి వేణుగోపాల్, రామచందర్, కె యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:
Pin Share