Headlines

నాయిజాతి రత్నాలు సంస్థ ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణుల దసరా పండుగ ఆత్మీయ అలయ్ బలయ్ సదస్సు.

నాయి బ్రాహ్మణులు రాజ్యాధికారం సాధించాలి..-ప్రముఖ వక్తలు

హైదరాబాద్,T6 న్యూస్: నాయి జాతి రత్నాలు సంస్థ ఆధ్వర్యంలో అబిడ్స్ జయ ఇంటర్నేషనల్ హోటల్ లో అలయ్ బలయ్ కార్యక్రమం శనివారం సాయంత్రం నాయిజాతి రత్నాలు సంస్థ నిర్వాహకులు ఏముల సుధాకర్, మోతె గోపాలకృష్ణ, మాసాయి రమేష్ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయి బ్రాహ్మణులు పాల్గొని ఒకరినొకరు ఆలింగనం చేసుకుని కండువాలు కప్పుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయుర్వేద వైద్యులు డాక్టర్ సారంగపాణి మాట్లాడుతూ.. ప్రతి ఏడు నాయి జాతి రత్నాలు వారు ఈ కార్యక్రమం గత 10 ఏండ్లుగా చేస్తున్నారని వారిని అభినందించారు. నాయి బ్రాహ్మణులు అందరూ ఏకతాటిపై ఉన్నప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు.

రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణులు అందరితో కలిసి లక్ష మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలన్నారు. నాయి బ్రాహ్మణులు అందరూ వారి సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నించాలని అడ్వకేట్ S.రామానంద స్వామి అన్నారు. సమస్యల పైన ప్రశ్నించినప్పుడే నాయి బ్రాహ్మణుల సత్తా ప్రభుత్వానికి తెలుస్తుందన్నారు. నాయి బ్రాహ్మణులకు ఫెడరేషన్లు ఉన్న దానికి ఏళ్ల తరబడి ఎన్నికలు, పాలకవర్గం లేక వెలవెల బోతుందని కేవలం నామ మాత్రం అధికారులు మాత్రమే ఉన్నారని అన్నారు.

రానున్న కొద్ది రోజుల్లోనే ఫెడరేషన్ కు ఎన్నికలు నిర్వహించేలా కోర్టులో కేసు ఫైనల్ కు చేరుకుంటుందన్నారు. ప్రముఖ కవి డా.రాపోలు సుదర్శన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఐక్యంగా ఉంటూ హక్కుల సాధన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. తాను సమాజంలో ఎదుర్కొన్న విషయాలను చెప్పారు. రెజ్లింగ్ కోచ్ నాగపురి జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ తాను మన వాళ్లకు శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. నాయి జాతి రత్నాలు నిర్వాహకులు ఏముల సుధాకర్ మాట్లాడుతూ నాయిబ్రాహ్మణులు తమ హక్కుల కోసం ఎవరిని బ్రతిమిలాడవలసిన అవసరం లేదని, గల్లాపట్టి సాధించుకోవాలని చెప్పారు. మాసాయి రమేష్ మాట్లాడుతూ ప్రతి ఏడు ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు. ఈ అలయ్ బలయ్ కార్యక్రమంలో భూపాల్ రాజ్, DRO సూర్యనారాయ, నరేష్, చక్రి, చందు, శేఖర్, ఎట్టయ్య, శ్రీనివాస్ ,రాకేష్ చేర్యాల, నర్సింగ్, నర్సింగ్ రావు, నరసింహారావు, సత్యం కానుగుల, శ్రీధర్ మురహరి, ఎ. వి. సత్యనారాయణ, బ్రహ్మయ్య, కొట్టాల యాదగిరి పెద్ద ఎత్తున నాయి బ్రాహ్మణ పాల్గొన్నారు.

Please follow and like us:
Pin Share