


“బిఆర్ఎస్ పార్టీ లో బారీగా చేరికలు“
-బిఅర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం
-కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణలో సబ్బండవర్గాలు ఆందోళన బాట పట్టాయి.
-స్వరాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో పదేండ్ల పాటు అభివృద్ధి మార్గంలో పరుగులు తీసిన తెలంగాణ..
-నేడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వల్ల సంక్షోభంలో కూరుకుపోయింది.
-నిరుద్యోగులు, రైతులు, విద్యార్థులు రోడ్డెక్కారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
-ప్రజాపాలన అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన హస్తం పార్టీ నేతలు తెలంగాణలో సమస్యలను చెప్పుకునేందుకు కూడా అవకాశం లేకుండా చేశారు.
-ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఎప్పుడో అటకెక్కించిన ప్రభుత్వ పెద్దలు బీఆర్‌ఎస్ హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాలకూ తిలోదకాలిచ్చారు.
-నమ్మించి నట్టేట ముంచిన సర్కారుపై ప్రజల్లో అడుగడుగునా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.
-వివిధ వర్గాల ధర్నాలు, నిరసనలతో హోరెత్తింది. ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడింది.
-ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం
-పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా
-స్థానిక ఎన్నికలలో సత్తాచాటాలి
-రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది
-రైతులు ఇబ్బంది పడుతున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టు ఉంది.
-కేసీఆర్ చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఆనాటి రోజులు తెచ్చింది
-రైతు రాజ్యం కాదు.. కాంగ్రెస్ పార్టీ దగా రాజ్యం
-రేవంత్ రెడ్డి చేసిన అప్పుతో ఢిల్లీకి మూటలు కట్టుడు తప్ప ఎం చేసాడు సమాధానం ఉందా?
-నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
నల్లగొండ,T6 న్యూస్; బిఅర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం అని నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.ఆదివారం నేరడుగొమ్ము మండలం ధర్మారేఖ్య తండాకు చెందిన 100మంది కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ గారి సమక్షంలో చేరారు. పార్టిలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ 22నెలల పాలనలో సబ్బండవర్గాలు ఆందోళన బాట పట్టాయి అని ఆయన అన్నారు.స్వరాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో పదేండ్ల పాటు అభివృద్ధి మార్గంలో పరుగులు తీసిన తెలంగాణ అని అన్నారు.నేడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వల్ల సంక్షోభంలో కూరుకుపోయింది అని తెలిపారు.నిరుద్యోగులు, రైతులు, విద్యార్థులు రోడ్డెక్కారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు అని అన్నారు.ప్రజాపాలన అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన హస్తం పార్టీ నేతలు తెలంగాణలో సమస్యలను చెప్పుకునేందుకు కూడా అవకాశం లేకుండా చేశారు.ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఎప్పుడో అటకెక్కించిన ప్రభుత్వ పెద్దలు బీఆర్‌ఎస్ హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాలకూ తిలోదకాలిచ్చారు అని అన్నారు.నమ్మించి నట్టేట ముంచిన సర్కారుపై ప్రజల్లో అడుగడుగునా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి అని తెలిపారు.రాష్ట్రమంతా వివిధ వర్గాల ధర్నాలు, నిరసనలతో హోరెత్తింది. ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడింది.పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా అని అన్నారు.స్థానిక ఎన్నికలలో సత్తాచాటాలి అని పిలుపునిచ్చారు.ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం అయింది అని తెలిపారు.22 నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలిపే పరిస్థితి వచ్చింది అని ఆయన అన్నారు బడికి పోయే పిల్లల నుండి పింఛన్లు అందుకునే అవ్వా తాతల దాకా రోడ్లు ఎక్కారంటే ఆ ఘనత రేవంత్ రెడ్డిదే అని తెలిపారు.కేసీఆర్ గారు బతుకమ్మ పండుగ వేల చీరెలు ఇచ్చిండు. కేసీఆర్ కిట్లు, న్యూట్రీషన్ కిట్లు ఇచ్చిండు, చెరువుల్లో చేపలు వేసిండు. గొర్రెలు ఇచ్చిండు
కేసీఆర్ ప్రభుత్వం పోయాక అన్నీ పోయాయి అని అన్నారు. నేడు 10వేలు, రేపయితే 15వేల రైతు భరోసా అన్నరు.మహిళలకు 2500 అన్నడు. ప్రతి మహిళకు 25వేల బాకీ పడ్డడు అని తెలిపారు.బతుకమ్మ చీరెలు అన్నడు, 500 ఇస్తడు అన్నడు ఎగ్గొట్టిండు అని అన్నారు వృద్ధులకు 4వేల పింఛన్ ఇస్తా అని మాట తప్పిండు ఇచ్చే రెండు వేల పింఛన్ కూడా రెండు నెలలు ఎగ్గొట్టిండు అని గుర్తు చేశారు.పింఛన్లు దగా రైతులకు బోనస్ దగా,రుణమాపీ దగా,తులం బంగారం దగా,విద్యార్థులకు జాబ్స్ దగా,మహిళలకు 2500 దగా, అన్నీ దగా ఎనుముల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు, చీటింగ్ మ్యాన్
అన్ని పంటలకు బోనస్ అని మోసం చేసిండు అని ఆయన తెలిపారు.కాంగ్రెస్ వికృత వైఖరి పట్ల గ్రామ గ్రామాన చర్చలు పెట్టాలి. ప్రజలు, రైతులు, యువత అందరికీ అర్థమయ్యేలా వివరించాలి అని పిలుపు నిచ్చారు.రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది ఆయన గుర్తు చేశారు.రైతులు ఇబ్బంది పడుతున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టు ఉంది అని తెలిపారు.కేసీఆర్ చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఆనాటి రోజులు తెచ్చింది అని ఆయన తెలిపారు.రైతు రాజ్యం కాదు.. కాంగ్రెస్ పార్టీ దగా రాజ్యం అని ఆయన అన్నారు.రేవంత్ రెడ్డి చేసిన అప్పుతో ఢిల్లీకి మూటలు కట్టుడు తప్ప ఎం చేసాడు సమాధానం ఉందా అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అభిషేక్ నాయక్,మాజీ సర్పంచ్ చెన్న నాయక్, బషీర్,తదితరులు ఉన్నారు.

