
వనపర్తి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావుకు వనపర్తి జిల్లా బీజేపీ శ్రేణులు ఆదివారం అపూర్వరీతిలో స్వాగతం పలికారు. అనంతరం వనపర్తి జిల్లాలో జరిగిన కార్యకర్తల సమ్మేళనంలో రాంచందర్ రావుతో కలిసి మహబూబ్ నగర్ ఎంపి డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావడంపై దిశానిర్దేశం చేసారు.
- కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. బీసీలను కేవలం ఓట్ల కోసమే వాడుకున్నది, వాడుకుంటున్నది.
- అందుకే ఎన్నికలొచ్చిన ప్రతిసారి బీసీ కార్డు వేసుకొని వస్తారు.
- కానీ మోదీ గారు దేశ ప్రజలందరి శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారు. వికసిత్ భారత్ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు.
- అందుకే అన్ని వర్గాలకు ఉపయోగపడేలా.. సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారు, అమలు చేస్తున్నారు.
- ఈ విషయాలను కార్యకర్తలే ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
- తెలంగాణలో కాంగ్రెస్ మోసాలను మనమంతా గమనించాము.
- 6 గ్యారంటీలు.. 420 హామీలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
- ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతిమాటను కాంగ్రెస్ తప్పింది.
- కేంద్రం ప్రభుత్వం అన్ని వర్గాల కోసం ఆలోచిస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం కేంద్ర పథకాలను ప్రజలకు అందకుండా కుట్రలు చేస్తుంది.
- అందుకే కార్యకర్తలు అంతా ప్రజలకు ఈ విషయాలను తెలియజేయాలి.
- మోదీ గారిని విమర్శించే స్థాయి, అర్హత ఈ రాష్ట్ర సీఎం రేవంత్ కు లేదు.
- మోదీ గారి కులం గురించి రేవంత్ మాట్లాడటం సిగ్గుచేటు.
- ఇలాంటోళ్లకు బుద్ధి రావాలి అంటే ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్ళాలి.
- భారతీయ జనతా పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి.

