
ఖమ్మం,T6న్యూస్: ఖమ్మం జిల్లాలో ప్రజలతో మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఇప్పటివరకు 3.54 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేశామని ఆయన వెల్లడించారు.
పదేళ్ల పాలనలో BRS ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇప్పటివరకు 3.54 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేశాం.
ఎన్నికల హామీలన్నింటినీ నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
ప్రజలకోసం పనిచేసే ప్రభుత్వమే ఇది. హామీలు కేవలం మాటలకు పరిమితం కాకుండా ఆచరణలో చూపిస్తాం అని హామీ ఇచ్చారు.
ఇదిలా ఉండగా, జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టులు, పథకాల అమలు, బస్తీబాట కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రజల మద్దతుతోనే ప్రభుత్వం బలంగా నిలుస్తుందని ఆయన అన్నారు.

