Headlines

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కపిల్ దేవ్..

డిల్లీ, T6 న్యూస్: తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం క్రీడా రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ ప్ర‌శంసించారు. ముఖ్య‌మంత్రిని ఢిల్లీలోని అధికారిక నివాసంలో కపిల్ దేవ్ క‌లిసి పలు అంశాలపై చర్చించారు.

➡️ రాష్ట్రంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు, క్రీడాభివృద్ధికి త‌మ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివ‌రించారు. ద‌క్షిణ కొరియాతో పాటు ప‌లు దేశాల్లో తాము సంద‌ర్శించిన క్రీడా యూనివర్సిటీలు.. అక్క‌డి క్రీడా ప్ర‌ముఖుల‌తో జరిగిన భేటీల వివ‌రాల‌ను ప్రస్తావించారు.

➡️ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీతో పాటు తెలంగాణ‌లో క్రీడాభివృద్ధికి సంబంధించిన అన్ని విష‌యాల్లో భాగ‌స్వామి కావడానికి సిద్ధంగా ఉన్నట్టు కపిల్ దేవ్ ఈ సందర్భంగా తెలియ‌జేశారు.

Please follow and like us:
Pin Share