Headlines

స్వాతంత్య్రం సాధించిన నాయకులలో గాంధీజీ అగ్రగన్యుడు… ఎమ్మెల్యే బాలునాయక్

జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ *నేనావత్ బాలు నాయక్* గారు. *చింతపల్లి* మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం వారు ఏర్పాటు చేసిన *జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహా ఆవిష్కరణ* కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై, మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించి, మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ *నేనావత్ బాలు నాయక్* గారు. *ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ….* ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో గాంధీజీ అగ్రగణ్యుడు అని అన్నారు.మహాత్మా గాంధీ భారత సమాజానికి ఒక వరం అని అన్నారు. గాంధీజీ గారి ఆదర్శాలు మరియు విలువలు మొత్తం ప్రపంచానికి కొత్త దిశానిర్దేశం చేశాయి అని ప్రపంచ యుద్ధాల కాలంలో ప్రపంచం అనేక రకాల ద్వేషం మరియు వైషమ్యాలతో బాధపడుతున్న సమయంలో ఆయన అహింస మార్గాన్ని చూపించారు అని అన్నారు.సత్యం మరియు అహింసతో గాంధీజీ చేసిన ప్రయోగం ఆయనకు గొప్ప మానవ హోదాను ఇచ్చిందని ఎమ్మెల్యే గారు అన్నారు. అనంతరం దేవరకొండ నియోజక వర్గ ప్రాంత ప్రజలందరికి తొలి ఏకాదశి పర్వదినం శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కో ఆప్షన్ సభ్యులు,PACs చైర్మన్లు, ఆర్యవైశ్య సంఘం నాయకులు,NSUI నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:
Pin Share