Headlines

రైతును రాజు చేయడమే లక్ష్యంగా పని చేస్తాం… ఎమ్మెల్యే బాలునాయక్

వ్యవసాయం అంటే దండుగ కాదు.. వ్యవసాయం అంటే పండుగ.

రైతును రాజు చేయడమే లక్ష్యంగా పని చేస్తాం.
— ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్

దేవరకొండ, T6 న్యూస్ : దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే గారి నివాసం వద్ద జాతీయ ఆహార భద్రత మిషన్ (NFM) ద్వారా జొన్న మరియు కందివిత్తనాల చిరు సంచులను లబ్ధిదారులకు స్వయంగా అధికారులతో కలిసి పంపిణీ చేసిన దేవరకొండ శాసన సభ్యులు శ్రీ నేనావత్ బాలు నాయక్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేంతవరకు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే ఉంటుందని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ స్పష్టం చేశారు. వ్యవసాయం అంటే దండుగ కాదు.. వ్యవసాయం అంటే పండుగ. రైతులను రాజులను చేయడమే లక్ష్యంగా పని చేస్తామని పునరుద్ఘాటించారు.రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వానికి రైతులు మొదటి ప్రాధాన్యత. అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే రైతు భరోసా కింద 7,625 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశాం. వచ్చే పదేండ్లలో వ్యవసాయాన్ని పండుగ చేస్తాం. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో 25,35,964 మంది రైతులకు సంబంధించి 20,617 కోట్ల రూపాయలు చెల్లించి రుణ విముక్తులను చేశాం అని అన్నారు. రైతాంగానికి అండగా నిలబడాలన్న లక్ష్యంతోనే రుణ మాఫీ, రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్, ఉచిత కరెంట్, స్ప్రింక్లర్స్, డ్రిప్, సోలార్ గిరి వికాసంలో పంపుసెట్లు, సివిల్ సప్లయ్ విభాగం ద్వారా ధాన్యం కొనుగోలు ఇలా కేవలం 18 నెలల కాలంలో వ్యవసాయ రంగంపై 1 లక్ష 04 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిన ప్రజా ప్రభుత్వం అని అన్నారు.

అనంతరం దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే గారి నివాసంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.

నిజమైన అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం. L1,L2,L3 లతో సంబంధం లేకుండా కేవలం నిజమైన అర్హులకు గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సంబంధిత అధికారులు సూచించారు. తొలి విడతలో ఇందిరమ్మ ఇండ్లను పేదవాళ్లలో బహుపేదవాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. మిగతా రెండు, మూడు, నాలుగు విడతలలో కూడా పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తాం అని అన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చే దిశగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమణా రెడ్డి,PD రాజ్ కుమార్, అగ్రికల్చర్ AD శ్రీ లక్ష్మీ,మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ రెడ్డి, ఎంపీడీఓలు, AE లు, ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, NSUI నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:
Pin Share