Headlines

పునర్జన్మను ఇచ్చే ప్రత్యక్ష దైవాలు డాక్టర్లు

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే

షాద్ నగర్ ప్రముఖ వైద్యులను సన్మానించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

రక్తదానం చేసిన వైద్యులు

రంగారెడ్డి,T6న్యూస్: కనిపించని ఆ దేవుడు ఊపిరిపోస్తాడు.. కనిపించే ఈ దేవుళ్లు మనకు పునర్జన్మను ప్రసాదిస్తారు.. వైద్యులే మనకు సమాజంలో దేవుళ్లనీ.. ఆసుపత్రులే వైద్యాలయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ కొనియాడారు.

ఇంటర్నేషనల్ డాక్టర్స్ డేను పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున డాక్టర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో డాక్టర్స్ డే ను పురస్కరించుకుని పలువురు వైద్యులు తదితరులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ డాక్టర్స్ డే ను ఉద్దేశించి మాట్లాడుతూ అంకితభావంతో, నిస్వార్థ సేవతో, ఆరోగ్యవంతమైన సమాజం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు మదన్ మోహన్ రెడ్డి, చెంది మహేందర్ రెడ్డీ, శరత్ చంద్ర బాబు, శివ నాగయ్య, కమ్మదానం సుధాకర్, నేతలు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, స్థానిక వైద్యులు బండారు రమేష్, అనురాగ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ విశ్వం, చెంది తిరుపతి రెడ్డి,అగ్గనూర్ బస్వాo, కృష్ణారెడ్డి, గుర్రంపల్లి రవీందర్ రెడ్డి, ఇబ్రహీం, రఘు నాయక్, మహమూద్, కృష్ణ, సుదర్శన్ గౌడ్, సీతారాం, శ్రీశైలం గౌడ్, శ్రీకాంత్ రెడ్డి,రఘు గౌడ్,శ్రీను నాయక్, ముబారక్ అలీ ఖాన్,లింగా రెడ్డి గూడ అశోక్ తదితరులు పాల్గొన్నారు

Please follow and like us:
Pin Share