
నేను పార్టీ మారలేదు నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశాను : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
హైదరాబాద్, T6 న్యూస్: తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు సంబంధించి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది.
ఈ నేపథ్యంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి స్పందించారు. “నేను పార్టీ మారలేదని స్పష్టంగా చెబుతున్నాను. నియోజకవర్గం అభివృద్ధి పనుల కోసం మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిశానని అంత మాత్రాన పార్టీ మారినట్టు కాదని నేను ఇప్పటికీ బిఆర్ఎస్ (BRS) పార్టీలోనే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి వ్యాఖ్యలతో గద్వాల రాజకీయాల్లో కొత్త చర్చలు మొదలయ్యాయి. స్థానికంగా ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడం సహజమని ఆయన తెలిపారు. తాను బిఆర్ఎస్ పార్టీ పట్ల నిబద్ధతతోనే ఉన్నానని, పార్టీని వదిలి వేళ్లలేదని అన్నారు .
అయితే, మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ కార్యాలయం తీసుకున్న తాజా నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ నోటీసుల తర్వాత అసెంబ్లీ పరిణామాలు ఏవిధంగా మలుపు తిరుగుతాయో చూడాలి.

