


హైదరాబాద్, T6 న్యూస్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గురు నానక్ యూనివర్సిటీ, తన విద్యా ప్రస్థానంలో మరో కీలక మైలురాయిని సాధించింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) ఆమోదం పొందిన నూతన న్యాయ కోర్సులు — B.A. LL.B. (5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం) మరియు LL.B. (హానర్స్) (3 ఏళ్ల ప్రోగ్రాం) ప్రారంభించినట్లు గర్వంగా ప్రకటించింది.
ఈ కోర్సులు విద్యార్థులకు నాణ్యత విద్యా, ప్రాక్టికల్ శిక్షణ మరియు నైతిక విలువలపై దృష్టి సారించేలా రూపొందించబడ్డాయని న్యాయ రంగంలో కెరీర్ ఆరంభించాలనుకునే యువతకు ఇది ఒక గొప్ప అవకాశంగా నిలుస్తుందని యాజమాన్యం తెలియచేసింది.
యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా ఏర్పాటు ద్వారా, నాణ్యమైన న్యాయ విద్యను అందించడంపై యూనివర్సిటీ యొక్క అంకితభావాన్ని మరింత బలపరుస్తోంది. ఇది పరిశోధన సంస్కృతి పెంపొందించడానికి, విద్యార్థులను న్యాయవాదులు, కార్పొరేట్ న్యాయ నిపుణులు, న్యాయాధికారులు మరియు న్యాయ రంగంలో నాయకులుగా తీర్చిదిద్దేందుకు దోహదపడుతుందని వారు తెలియచేసారు.
ఈ సందర్బంగా గురు నానక్ యూనివర్సిటీ ఛాన్సలర్ సర్దార్ గగన్‌దీప్ సింగ్ కోహ్లీ, వైస్ ఛాన్సలర్ డా. హెచ్.ఎస్. సైనీ, యూనివర్సిటీ రెక్టర్ డా. సి. కలైరాసొన్, రిజిస్ట్రార్ డా. విశాల్ వాలియా, బార్ కౌన్సిల్ అఫ్ ఇండియా కు ధన్యవాదాలు తెలియచేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ తమ యూనివర్సిటీ ద్వారా విద్యార్థులకు ఉత్తమమైన విద్యా, సమగ్ర విద్యార్థి అభివృద్ధిపై మరియు అభివృద్ధిశీల విద్య ద్వారా దేశ నిర్మాణంపై విశ్వవిద్యాలయం నిబద్ధతను పునరుద్ఘాటించారు.
ఈ ఆవిష్కరణ, గురు నానక్ యూనివర్సిటీ 24 సంవత్సరాల విద్యా ప్రావీణ్యాన్ని ఆధునిక వృత్తిపరమైన కోర్సులతో మిళితం చేస్తూ, న్యాయ రంగంలో కొత్త మార్గాలను అన్వేషించాలనుకునే విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు.

