Headlines

గురు నానక్ విద్య సంస్థలలో ఘనంగా జరిగిన ఒరియెంటేషన్ కార్యక్రమం

హైదరాబాద్, ఆగస్ట్ 20: ఇబ్రహీంపట్నం గురు నానక్ విద్యాసంస్థలలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్త విద్యార్థుల కోసం ఒరియెంటేషన్ కార్యక్రమం నూతన విద్యార్థులు మరియు వారి తల్లి తండ్రుల సమక్షంలో నేడు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం విద్యార్థుల జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడంతోపాటు, సంస్థ యొక్క విలువలు, దృష్టికోణం మరియు విద్యా సంస్కృతిని వారికి పరిచయం చేసింది.

ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ప్ర‌యాగ్ కన్స్యూమర్ కేర్ సంస్థలో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శ్రీ కృతివాసన్ ఎస్, నోబుల్ ‘క్యూ’ కంపెనీ జనరల్ మేనేజర్ శ్రీ సురేష్ పెరుగు, ఉన్ని కృష్ణన్, సైంటిస్ట్, ఆర్ సి ఐ-డి ఆర్ డి ఓ హాజరయ్యారు. వారి విస్తృత పరిశ్రమ అనుభవం ఆధారంగా వారు విద్యార్థులకు ప్రేరణాత్మకంగా ప్రసంగిస్తూ, ఉన్నత లక్ష్యాలు పెట్టుకోవాలని, నిరంతర విద్య మరియు ఆవిష్కరణపై దృష్టి పెట్టాలని సూచించారు.

కార్యక్రమానికి గురు నానక్ విద్య సంస్థల వైస్ చైర్మన్ మరియు గురు నానక్ యూనివర్సిటీ చాన్సలర్ అయిన సర్దార్ గగన్‌దీప్ సింగ్ కోహ్లీ అధ్యక్షత వహించారు. ఆయన విద్యార్థులను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, సమగ్ర విద్యను అందించడంలో సంస్థ తీసుకుంటున్న కృషిని వివరించారు.

గురు నానక్ ఇన్‌స్టిట్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గురు నానక్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డా. హెచ్.ఎస్. సైనీ విద్యా ప్రణాళిక, పరిశోధన అవకాశాలు మరియు విద్యార్థుల అభ్యున్నతికి సంస్థ చేపట్టిన కార్యక్రమాలపై విశ్లేషణాత్మకంగా ప్రసంగించారు.
కార్యక్రమంలో డా. ఎస్ శ్రీనాథ రెడ్డి, డైరెక్టర్, గ్నిటీసీ, డా. సంజీవ్ శ్రీవాస్తవ, డైరెక్టర్, GNIT
డా. పి. పార్థసారధి, జాయింట్ డైరెక్టర్
డా. కె. వెంకట రావు, ప్రిన్సిపల్,
డా. రిషి సయాల్, అసోసియేట్ డైరెక్టర్
డా. ఎస్.వి. రంగనాయకులు, డీన్ – R&D,
అసిస్టెంట్ డైరెక్టర్ డా. కేదార్నాథ్,
డా. భాస్కర్ , శ్రీమతి విజయలక్ష్మి, మొదటి సంవత్సరం కోఆర్డినేటర్లు, శ్రీ వినయ్ చోప్రా, డైరెక్టర్ – ప్లేస్‌మెంట్స్ మరియు హెడ్ – కార్పొరేట్ రిలేషన్స్
కర్నల్ (రిటైర్డ్) జోయన్తా సర్కార్, జీఎం అడ్మిన్, ఇతర విభాగ అధిపతులు సిబ్బంది పాల్గొని విద్యార్థులు వారి తల్లితండ్రులకు మార్గదర్శక ఉపన్యాసాలు చేస్తూ వాటి ప్రాముఖ్యతను తెలియచేసారు.
అనంతరం విద్యార్థుల కోసం ఇంటరాక్టివ్ సెషన్లు, సాంస్కృతిక ప్రదర్శనలు మరియు క్యాంపస్ టూర్ ఏర్పాటు చేస్తూ విద్యార్థులు తమ విద్యా ప్రస్థానాన్ని ఉత్సాహంగా ప్రారంభించేందుకు అనుకూల వాతావరణం కల్పించడానికి నిర్వాహకులు చేసిన కృషిని తల్లి తండ్రులు ప్రశంసించారు.

Please follow and like us:
Pin Share