
ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు గారి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. విలక్షణ నటనతో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరించిన కోట శ్రీనివాసరావు మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటు అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

