Headlines

కాంగ్రెస్ హస్తం.. బీసీల నేస్తం… ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

చింతపల్లి మండలంలోని తీదేడు గ్రామ జిల్లా పరిషత్ హై స్కూల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ ఓ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించి,గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు.

ఆర్ ఓ వాటర్ ప్లాంట్ ను పాఠశాల విద్యార్థులు,గ్రామ ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలి తెలిపారు.

పాఠశాల ఆవరణలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రతినిధులు,అధికారులతో కలిసి మొక్కలు నాటారు.

తీదేడు గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన గ్రీన్ కో కంపెనీ వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేయడం జరిగింది.

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు వారి కుటుంబానికి ఆదుకుంటాం అని తెలిపారు.

అనంతరం చింతపల్లి మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన కున్న అజయ్ గారు విద్యుత్ షాక్ తో మరణించిన విషయం తెలుసుకొని నేడు దేవరకొండ ఏరియా ఆసుపత్రికి చేరుకొని అజయ్ గారి భౌతిక కాయానికి నివాళి అర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కో ఆప్షన్ సభ్యులు, NSUI నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:
Pin Share