Headlines

సన్న బియ్యంలో 50% నూకలే…

*సన్న బియ్యం లో 50% నూకలే*

*సీఎం తీరు బస్తీమే సవాల్.. తెల్లారితే పరార్*

*అమ్మ ఒడి వాహనానికి డీజిల్ పోయలేని దౌర్భాగ్యం*

*మహాలక్ష్మి పథకం అమలు చేయకపోతే “మహిళా ఉద్యమమే”*

*జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత*

*షాద్ నగర్ పర్యటనలో రేవంత్ సర్కార్ పై ఫైర్*

*కాకునూరులో మహాలక్ష్మి పథకం అమలు కోసం పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం*

*సోనియాగాంధీకి స్వయంగా పోస్ట్ కార్డు పంపించిన కవిత*

*స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించండి*

*పాలమూరు ప్రాజెక్టు పనులు 90% పూర్తి చేసిన కేసీఆర్*

*పైసా అప్పు పుట్టడం లేదని తెలంగాణ ఇజ్జత్ తీస్తున్న రేవంత్ రెడ్డి*

*కాకునూరు, వేములనర్వలో ఎమ్మెల్సీ కవితకు అభిమానుల భారీ స్వాగతం*

రంగారెడ్డి: మహిళలు మహాలక్ష్మిలని ప్రతినెల 2500 ఇస్తానని ఇవ్వలే.. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తానని ఇవ్వలే.. ఉచిత బస్సులను బస్సులు తగ్గించిండు.. విద్యార్థులకు స్కూటీలు కొనిస్తామని మోసం చేసిండు.. సన్నబియ్యంలో 50% నూకలే .. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే అమ్మ ఒడి వాహనాలకు డీజిల్ పోయలేని దౌర్భాగ్య పరిస్థితి.. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం పనులు చేపట్టకుండా నిర్లక్ష్యం..
విద్యార్థులకు స్కూటీ ఇస్తానని మోసం.. పేదోడి గుడిసెను హైడ్రాతో కూల్చుతారు.. పెద్దోడి ఇంటికి కాపలా ఉంటారు.. ఏమన్నా అంటే.. రాష్ట్ర అభివృద్ధికి పైసా అప్పు పుట్టడం లేదని తెలంగాణ ఇజ్జత్ తీస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనకు అవసరమా వచ్చే స్థానిక ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించండి అంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రజలకు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కిశంపేట మండలం వేముల నర్వ, కాకునూరు గ్రామాల్లో కవిత పర్యటించారు. మండలంలోని కాకునూరు గ్రామంలో మహాలక్ష్మి పథకం అమలు కోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పోస్టు కార్డు ఉద్యమానికి ఈ సందర్భంగా శ్రీకారం చుట్టారు. కాకులూరు గ్రామంలో మహిళల చేత మహాలక్ష్మి పథకం అమలులో భాగంగా ప్రతినెల రూ.2500 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారి చేత కార్డులను పోస్టు బాక్స్ లో వేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో హామీలను ప్రజలకు ఇచ్చారని తప్పుడు వాగ్దానాలతో గద్దెనెక్కారని విమర్శించారు. రేవంత్ రెడ్డి తెలంగాణకు తక్కువ ఢిల్లీకి ఎక్కువని రాష్ట్ర పాలన వదిలేసి ఢిల్లీలో అధిష్టానం చుట్టూ తన కృషి కాపాడుకోవడానికి విమానాల్లో ఎక్కువగా తిరుగుతుంటారని కవిత ఎద్దేవా చేశారు.

* గత ఎన్నికల సందర్భంగా మహిళలకు ప్రతినెల మహాలక్ష్మి పథకం ద్వారా 2500 రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. ఒక కాకులూరు గ్రామంలోని 1100 మహిళలు ఉన్నారని ప్రభుత్వం వచ్చి 18 నెలల కాలంలో వారికి కనీసం నెలకు 2500 రూపాయలు చొప్పున 5 కోట్ల రూపాయలు ఈ గ్రామానికి బకాయి ఉన్నాడని కవిత లెక్కలు వేసి మరియు వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మి కోసం ఒక లక్షతో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పి ఆహామీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి అమ్మకు అన్నం పెట్టని వాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. పొద్దున లేస్తే కేసీఆర్ను రాజకీయంగా తిట్టడం తప్ప అభివృద్ధి చేతకాని రేవంత్ రెడ్డిని ఏమనాలని కవిత ప్రశ్నించారు.
సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే అమ్మ ఒడి వాహనానికి డీజిల్ పోయలేని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని మీడియాలో అమ్మఓడి వాహనాన్నీ నెట్టుకుంటూ వెళ్లిన వార్తలు పత్రికల్లో చదివానని విచారం వ్యక్తం చేశారు. కెసిఆర్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ లకే రేవంత్ రెడ్డి సర్కార్ ఉద్యోగాలు భర్తీ చేసిందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి పైసా అప్పు పుట్టడం లేదని తెలంగాణ రాష్ట్ర పరువు తీస్తున్నాడని కవిత విమర్శించారు. మూడు నెలల నుండి గ్రామాల్లో పింఛన్లు రాక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని 2000 పింఛను 4000 ఇస్తానని చెప్పి మోసం చేశాడని ఆరోపించారు.
ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులు సరైన సదుపాయాలు లేక చనిపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇంత దారుణం ఎక్కడా చూడలేదని ఆమె అన్నారు. రేవంత్ రెడ్డి అప్పు పుట్టకపోతే కేసీఆర్ మాదిరిగా ఆయన చేసిన పనులేని అనుసరించి చేయవచ్చని ఆయన కొత్తగా చేసేది ఏమీ ఉండదని అన్నారు.

*బస్తీమే సవాల్.. తెల్లారితే పరార్*

తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యాక పేదోళ్ల గుడిసెలను కూల్చడానికి బుల్లోజర్లు వస్తున్నాయని, పెద్దోడి ఇంటికి మాత్రం రక్షణ ఏర్పాటు చేశారని కవిత ఘాటుగా విమర్శించారు. హైడ్రా పై చర్చించుదామంటే బస్తీమే సవాల్ అని అంటాడని తెల్లారితే పరార్ అవుతాడంటూ ఎద్దేవా చేశారు.

*స్థానిక సంస్థల్లో బుద్ధి చెప్పండి*

రాబోయే స్థానిక ప్రాదేశిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కవిత పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ బరాబర్ అడిగి తీరుతామని పాటల రూపంలో కూడా ప్రశ్నిస్తామని కవిత అన్నారు. కాకునూరు గ్రామానికి చెందిన అక్కమ్మ రాములమ్మలు పాడిన జానపదాల ద్వారా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ హామీలను ప్రశ్నించుదామని రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వస్తే నిలదీయాలని కవిత సూచించారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయొద్దని మరోసారి మోసపోతారని ఆమె అన్నారు.

*దమ్ముంటే పది బస్సులు వేయండి*

మహిళలకు ఉచిత బస్సుల పేరిట రేవంత్ సర్కార్ ప్రజలకు అనేక ఇబ్బందులు సృష్టించిందని కవిత అన్నారు.  గతంలో కాకునూరు గ్రామానికి ఉదయం సాయంత్రం రెండు పూటల బస్సులు వచ్చేవని కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఐదు బస్సులు బస్సులు వచ్చేవమన్నారు. ఇప్పుడు ఉచిత బస్సు అయ్యాక బస్సులేకుండా అయ్యాయని మహిళల సంగతి సరే కానీ ఇక మగాళ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని డబ్బులు పెట్టి నిలబడి ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. డబ్బులు పెట్టి బస్సులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని కనీసం గ్రామానికి 10 బస్సులైనా ఇవ్వాలని తాను కోరుకుంటున్నానని దీనికి మద్దతుగా చేతులు లేపాలని గ్రామస్తులను కోరారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సుల సంఖ్య పెంచకపోతే తగిన గుణపాఠం నేర్పిస్తామని హెచ్చరించారు. తన వీరాభిమానులు సీమ రమేష్, గండ్రాతి జగదీష్ తదితరుల ఆహ్వానం మేరకు తను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు.

*ఇయ్యాల శనివారం బొక్క ముట్టను*

మా సీమ రమేష్ కాకునూరు గ్రామంలో కంట్రీ చికెన్ బాగుంటుంది అక్క అని చెప్పిండు.. నేను కూడా తిందాం అనుకున్నాను కానీ ఇయ్యాల శనివారం మాంసం, బొక్క ముట్టను అంటూ సభలో నవ్వులు కురిపించారు. గ్రామీణులను ఆకట్టుకునే విధంగా కొంత కెసిఆర్ ను పోలి ఆమె ప్రసంగించారు. కాకునూరు గ్రామంలో నాటు కోళ్లు బాగా రుచిగా ఉంటాయని చెప్పారని శనివారం కాబట్టి మరోసారి ట్రై చేద్దామని ప్రస్తుతానికి రమేష్ ఇంట్లో పప్పన్నం తింటా అని కవిత పేర్కొన్నారు. కాసేపు తనదైన స్టైల్ లో కవిత ప్రభుత్వంపై పంచులు వేస్తూ జనని నవ్విస్తూ ప్రసంగం సాగించారు..

Please follow and like us:
Pin Share