



*కల్వకుర్తి నియోజకవర్గంలో మంత్రి కోమటి వెంకట్ రెడ్డి పర్యటన*రంగారెడ్డి జిల్లా మాడ్గులలో రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,దామోదర్ రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు లకు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు.మహనీయులు డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్, జ్యోతీరావ్ పులే విగ్రహాలకు మరియు మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర మంత్రులు, స్థానిక శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి. పర్యటన లో భాగంగా మాడ్గుల మండల కేంద్రంలో 12 కోట్ల 70 లక్షల రూపాయలతో నిర్మించబోయే 30 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు.220 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి & షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.అనంతరం, వెల్దండ నుండి శిరసనగండ్ల వరకు 40 కోట్లతో నిర్మించే BT (Double Lane) రోడ్డునకు శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టారు.కోనాపూర్ నుండి మాడ్గుల వరకు to & మాడ్గుల నుండి దేవరకొండ రోడ్ వరకు 70 కోట్ల రూపాయలతో నిర్మించే BT (Double Lane) రోడ్డుకు శంకుస్థాపన చేశారు.

