

హైదరాబాద్, T6 న్యూస్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ అధ్యక్షుడు శ్రీ మల్లిఖార్జున ఖర్గే కలిసి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్ లక్డీకాపూల్ లో శ్రీ కొణిజేటి రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. అనంతరం మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోశయ్య సేవలు మరువలేనివి అని అన్నారు. కాంగ్రెస్ పార్టికి ఎన్నో సేవలు అందించారని అయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , జూపల్లి కృష్ణారావు , పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ , హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి , ఇతర ప్రజాప్రతినిధులు, రోశయ్య గారి కుటుంబ సభ్యులు, ట్రస్ట్ ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.

