
చింతపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్–2026లో భాగంగా, దేవరకొండ నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు ఈ నెల 4, 5 తేదీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చింతపల్లి మండలంలో నిర్వహించనున్నట్లు నియోజకవర్గ క్రీడల కన్వీనర్, దేవరకొండ ఇంచార్జి ఎంపీడీవో పార్వతమ్మ తెలిపారు.ఈ పోటీల్లో భాగంగా4వ తేదీన ఖో ఖో, కబడ్డీ, వాలీబాల్ క్రీడాంశాల్లో5వ తేదీన అథ్లెటిక్స్ విభాగాల్లోనియోజకవర్గంలోని 8 మండలాల నుండి ఎంపికైన క్రీడాకారులు పాల్గొననున్నారని తెలిపారు.ఈ సందర్భంగా నియోజకవర్గ క్రీడల ఇన్‌చార్జి శ్రీ జె. చంద్రయ్య మాట్లాడుతూ, అర్హత పొందిన క్రీడాకారులు అందరూ సమయానికి హాజరై పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటాలని కోరారు.అదేవిధంగా క్రీడాకారులు, క్రీడాభిమానులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ క్రీడలను విజయవంతం చేయాలని క్రీడల కన్వినర్ ఇంచార్జ్ ఎంపీడీవో పార్వతమ్మ ఆకాంక్షించారు.

