

చింతపల్లి,ఫిబ్రవరి 2: జాతీయ ఉపాధి హామీ కూలీలకు వేతనం పెంచాలని హోమంతాలపల్లి గ్రామ సర్పంచ్ వంగాల స్రవంతి రమేష్ అన్నారు.సోమవారం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనులను ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో చేసిన పనులకు సంబంధించిన గత పెండింగ్ బిల్లుల చెల్లించాలని కోరారు. అనంతరం విద్యార్థుల భోజన సమయంలో పరిశీలించారు. అదేవిధంగా అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించి చిన్నారులకు, బాలింతలకు గర్భిణీ స్త్రీలకు బాలామృతం, పోషక ఆహారం గురించి ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు, అంగన్వాడి సిబ్బంది, పాఠశాల బాల బాలికలు పాల్గొన్నారు.

