Headlines

సంగారెడ్డిలో ధృవ ఆస్పత్రికి సీఎం రేవంత్ రెడ్డి

సంగారెడ్డి,T6న్యూస్: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పరిశ్రమలో జరిగిన ఘోర రసాయన ప్రమాదం నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం ధృవ ఆస్పత్రిని సందర్శించారు. ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితిని తెలుసుకొని, వారిని పరామర్శించారు.

🔹 బాధితులను పరామర్శించిన సీఎం

పాశమైలారం ప్రమాదంలో గాయపడిన పలువురు ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని ఎదురుగా చూసిన సీఎం రేవంత్ రెడ్డి, వైద్య సిబ్బందిని వివరంగా ప్రశ్నించి చికిత్సపై ఆరా తీశారు. ఒకో రోగికి సరైన వైద్యం అందుతున్నదా? ఎవరి పరిస్థితి ఎలా ఉంది? అనే ప్రశ్నలతో డాక్టర్లతో సమీక్ష నిర్వహించారు.

🔹 బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా

గాయపడిన బాధితుల కుటుంబ సభ్యులను పలుకరించిన సీఎం, “ఈ విషాద ఘట్టంలో ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి పూర్తి సహాయం అందించేందుకు కట్టుబడి ఉన్నాం” అని భరోసా ఇచ్చారు.

🔹 మెరుగైన వైద్యం అందించండి – అధికారులకు సీఎం ఆదేశం

బాధితుల ప్రాణాలతో రాజీ పడకూడదని, అవసరమైతే వైద్యులను ప్రత్యేకంగా హైదరాబాద్‌ నుంచి రప్పించండని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే వైద్యం ఖర్చులన్నింటినీ ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు.

🔹 ప్రమాద స్థలానికి సీఎం పర్యటన

ఈ పరామర్శకు ముందే సీఎం రేవంత్ రెడ్డి పాశమైలారం ఘటన స్థలాన్ని పరిశీలించారు. పరిశ్రమలో పరిస్థితిని పరిశీలించి, భద్రతా లోపాలపై అధికారులతో చర్చించారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎవరి బాధ్యతా? అనే కోణంలో అధికారులు నివేదిక అందించాలన్నారు.

Please follow and like us:
Pin Share