
దేవరకొండ: దేవరకొండ పట్టణం 11వ వార్డులో నివసిస్తున్న హసీనాబేగం, ఫరూక్ మహమ్మద్ గారి ఆహ్వానం మేరకు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలునాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూ…,
పేదలకు సొంత ఇల్లు నిర్మించిలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అనేక నిరుపేద కుటుంబాల కల నెరవేరుతోందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ప్రతి అర్హుడైన పేదవారికి ఇల్లు అందే వరకు ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందని స్పష్టం చేశారు.
ప్రభుత్వ పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరుతున్నాయనే దానికి ఇందిరమ్మ ఇళ్లే ప్రత్యక్ష ఉదాహరణ అని ఎమ్మెల్యే అన్నారు. భవిష్యత్తులో కూడా దేవరకొండ నియోజకవర్గంలో పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

