Headlines

దళారులకు ధాన్యం అమ్మి రైతులు మోసపోవద్దు. మార్కెట్ కమిటి చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి.

నల్లగొండ: దళారులకు ధాన్యం అమ్మి రైతులు మోసపోవద్దని మాల్ మార్కెట్ కమిటి చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి అన్నారు. సోమవారం చింతపల్లి మండల కేంద్రంలో ప్రాధమిక సహకార సంఘంలో పాడి ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటి చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి ప్రభుత్వం ప్రకటించిన ధరకు మాత్రమే అమ్మాలని అలాగే దళారులకు ధాన్యాన్ని అమ్మి ఎవరు మోసపోవద్దని సూచించారు. సాధారణ ధాన్యం రకానికి ప్రకటించిన మద్దతు ధర Grade A రకానికి రూ.2389, సాధారణ రకానికి :రూ.2369 మరియు సన్న ధాన్యానికి రూ.500 బోనస్ పొంది సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

తాలు, తేమ లేకుండా ధాన్యాన్ని తీసుకువచ్చి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సహకరించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ .చైర్మన్ లింగంపల్లి వెంకటయ్య, వ్యవసాయధికారి శ్రవణ కుమారి, ఎంపిడిఓ సుజాత, తహసీల్దార్ విజయలక్ష్మి, AEO మౌనిక, ప్రియాంక, మాజీ సర్పంచ్ ముచ్చర్ల యాదగిరి, మాజీ ఎంపిటిసిలు కాసారపు శ్రీనివాస్, వెంకటయ్య గౌడ్, మాజీ కో ఆప్షన్ సభ్యులు రియాజ్ పాష, రైతులు, తదితరులు పాల్గొన్నారు..

Please follow and like us:
Pin Share