
హైదరాబాద్, అక్టోబర్ 29: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సీబీఐ కోర్టు ఊరట కల్పించింది. ఆయన లండన్ పర్యటనపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది.
ఈ నెల 11న తన పెద్ద కుమార్తెను కలిసేందుకు లండన్‌కు వెళ్లిన జగన్‌పై బెయిల్ షరతులను ఉల్లంఘించారని సీబీఐ ఆరోపించింది. తన సొంత ఫోన్ నంబర్‌ను వెల్లడించకపోవడం, ఇచ్చిన నంబర్ పని చేయకపోవడం వంటివి ఉద్దేశపూర్వక చర్యలేనని సీబీఐ వాదించింది. లండన్ పర్యటనలో ఉన్న సమయంలో మూడు సార్లు ఫోన్ చేసినా స్పందన లభించలేదని పిటిషన్లో పేర్కొంది.
అయితే, సీబీఐ వాదనల్లో తగిన ఆధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో జగన్‌కు గట్టి ఊరట లభించింది.
వైఎస్సార్సీపీ వర్గాలు ఈ తీర్పును స్వాగతిస్తూ, రాజకీయ కారణాలతోనే సీబీఐ పిటిషన్ దాఖలు చేసిందని వ్యాఖ్యానించాయి.

