Headlines

జాగృతి జనంబాట పోస్టర్ ఆవిష్కరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

అక్టోబర్ 25 నుంచి ఫిబ్రవరి 13 వరకు నాలుగు నెలల పాటు 33 జిల్లాల్లో యాత్ర నిర్వహించనున్న కవిత

ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ..

  • తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యల పట్ల జాగృతి పోరాటం చేస్తూనే ఉంది.
  • నిన్న కూడా గ్రూప్ -1 అభ్యర్థుల కోసం పోరాటం చేశాం.
  • ఎన్ని సమస్యలను అడ్రస్ చేసిన కూడా మళ్లీ కొత్త సమస్యలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తూనే ఉన్నాయి.
  • కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని ఎన్నో సమస్యలు పట్టి పీడిస్తున్నాయి.
  • గ్రామాల్లో యూరియా సమస్యతో పాటు పట్ణణాల్లోనూ అనేకానేక సమస్యలు ఉన్నాయి.
  • ఈ సమస్యల పరిష్కారాన్ని పక్కనపెట్టి ప్రతిపక్షాలనే ఈ ప్రభుత్వం తిడుతోంది.
  • కనీసం జాతీయ పార్టీ అయిన బీజేపీ అయిన ఏమైనా చేస్తుందా అంటే అది లేదు.
  • బీజేపీ కి 8 ఎంపీలు, 8 ఎమ్మెల్యేలను ఇస్తే తెలంగాణకు కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
  • తెలంగాణలో ప్రస్తుతం ప్రతి గ్రామంలో అనిశ్చితి ఉంది.
  • కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రజలకు అందిన ప్రతిఫలాలు ఇప్పుడు అందటం లేదు.
  • గతంలో ఇచ్చిన కేసీఆర్ కిట్స్ సహా ఏ ప్రయోజనాలను ఈ ప్రభుత్వం జనాలకు అందకుండా చేస్తోంది.
  • తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా ప్రత్యేక రాష్ట్ర ఫలితాలు ప్రజలకు అందని పరిస్థితికి బాధ్యులు ఎవరు?
  • జాగృతి సంస్థగా మేము గతంలో మా పని మేము చేసుకున్నాం.. అప్పుడు కూడా కేసీఆర్ గారి ఫోటో పెట్టుకోలేదు.
  • ఎప్పుడైతే నేను బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచానో అప్పుడే పెద్ద సారు ఫోటోలను పెట్టాం.
  • మా పార్టీ అధినేతగా కేసీఆర్ గారి ఫోటోలు కచ్చితంగా పెట్టుకున్నాం.
  • ఆ సమయంలో బీఆర్ఎస్ కోసం, బీఆర్ఎస్ ప్రభుత్వం కోసం చిత్తశుద్ధితో పనిచేశాం.
  • ప్రభుత్వ అందించిన ఫలాలు, ఫలితాలు కింది వరకు పోయేలా మా ప్రయత్నం చేశాం. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి నన్ను సస్పెండ్ చేశారు.
  • నేను మొదటి నుంచి కొంత ఆలోచన, సమాజం పట్ల కన్ సర్న్ ఉన్న వ్యక్తిని. అందుకే తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడిన.
  • కన్ సర్న్ ఉంది కనుకే భౌగోళిక తెలంగాణ మాత్రమే సాధించాం. సామాజిక తెలంగాణ సాధించుకోవాల్సి ఉందని చెప్పాను.
  • సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని వర్గాలకు అవకాశాలు దక్కటమే సామాజిక తెలంగాణ.
  • దాంట్లో ఏం తప్పు ఉందని నాపై నింద మోపారు. కుట్ర చేసి పార్టీ నుంచి పంపారు.
  • అప్పుడు చెప్పిందే ఇప్పుడు చెబుతున్నాను. మనం సామాజిక తెలంగాణ సాధించాల్సి ఉంది.
  • బీసీ, ఎస్సీ, ఎస్టీలది మాత్రమే సామాజిక తెలంగాణ కాదు. ఓసీల్లో పేదలు, మహిళలు, యువత ఇలా అన్నివర్గాల ప్రజలు బాగుండటమే సామాజిక తెలంగాణ.
  • అందరికీ వారికి రావాల్సిన హక్కులు రావాలి.. అందుకోసమే మా పోరాటం.
  • సామాజిక తెలంగాణ ఒక నినాదం కాదు. అది మా విధాన పరమైన నిర్ణయం
  • జాగృతి ఉన్నంత వరకు అన్ని వర్గాలకు మేలు కోసం కట్టుబడి ఉన్నాం.
  • మాకు ప్రజలే గురువులు, పెద్ద పెద్ద నాయకులను ఓడించినా, సామాన్యులను గెలిపించినా అది ప్రజల చేతుల్లోనే ఉంది.
  • అందుకే మేము ప్రజల మధ్యకే పోవాలని అనుకుంటున్నాం.
  • హైదరాబాద్ లో కూర్చొని సమస్యలు మాట్లాడటం కన్నా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకోవాలనుకుంటున్నాం.
  • మన తెలంగాణలో మనసు, సానుభూతితో ఆలోచించే ఎంతో మేధావులు ఉన్నారు.
  • మంచి, మంచి నాయకులు ఉన్నారు. వారందరినీ కలిసి మాట్లాడుతాం.
  • ప్రతి జిల్లాలో అన్ని వర్గాల వారితో వారి అభిప్రాయాలు, ఆలోచనలను పంచుకుంటాం.
    దాని నుంచి ఒక నిర్ణయానికి వస్తాం.
  • అందరికీ సమాన అవకాశాలు వచ్చే తెలంగాణ కోసం ఏం చేయాలనే దానిపై చర్చిస్తాం.
  • హైదరాబాద్ తో పాటు గ్రామాల్లో ఉండే అన్ని వర్గాల వారితో చర్చలు జరుపుతాం.
  • ఆయా గ్రామాల్లో ఉండే రైతులు, మహిళలు, యువత ఇలా అన్ని వర్గాల వాళ్లు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుంటాం.
  • దానికోసమే ఈ నెల 25 నుంచి జాగృతి జనం బాట కార్యక్రమాన్ని చేపడుతున్నాం.
  • మొత్తం 4 నెలల పాటు జనంలో ఉంటాం.
  • ప్రతి జిల్లాలో రెండు రోజులు ఉండి అన్ని వర్గాలతో చర్చలు జరుపుతాం.
  • తెలంగాణలో అమరుల ప్రాణా త్యాగాలు ఎందుకు జరిగాయో మనం అర్థం చేసుకోవాలి.
  • తెలంగాణ తెచ్చుకొని అందరూ బాగుండాలనే వారు ప్రాణత్యాగం చేశారు.
  • వారి ఆశయమైన సామాజిక తెలంగాణ సాధించటమే నా యాత్ర లక్ష్యం.
  • కేసీఆర్ గారి ఫోటో లేకుండానే యాత్ర చేయనున్నాం.
  • ఐతే ఇది వారిని అగౌరవపర్చినట్లు కాదు. వారు లేకుండా తెలంగాణయే లేదు.
  • కానీ వారు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఆ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేశారు.
  • ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా నేను రిజైన్ చేశాను.
  • అలాంటప్పుడు ఆయన ఫోటోతో నేను ముందుకు వెళ్లటం నైతికంగా సరికాదు. నైతికంగా కరెక్ట్ కానీ దాన్ని నేను చేయలేను.
  • చెట్టు పేరు చెప్పుకొని బతికే ఉద్దేశం లేదు.
  • ఆ చెట్టు నీడ లో ఉన్నంత వరకు దుర్మార్గుల బారి నుంచి చెట్టును కాపాడేందుకు ఎంతో ప్రయత్నం చేశా.
  • ఇప్పుడు నా దారి నేను వెతుక్కుంటున్నా. ఈ సమయంలో వారి ఫోటో పెట్టడం సరికాదు.
  • నేను నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసే వరకు జాగృతిలో కేసీఆర్ గారి ఫోటో పెట్టలేదు.
  • నైతికంగా కరెక్ట్ కాదనే భావనతోనే నేను కేసీఆర్ గారి ఫోటోను జనం బాట కార్యక్రమం పోస్టర్ లో పెట్టటం లేదు… మీడియాలో ఏవేవో కథనాలు ప్రచురిస్తున్నారు కాబట్టే దీనిపై నేనే వివరణ ఇస్తున్నాను
  • కేసీఆర్ గారి కూతురుగా పుట్టటం జన్మజన్మల అదృష్టం. ఆయనను అగౌరవ పర్చే పని చేయను.
  • మీడియా మిత్రులు కొంతమంది అత్యుత్సాహంతో కేసీఆర్ గారి ఫోటో లేదంటూ వార్తలు రాస్తున్నారు.
  • జాగృతి మొదలైనప్పుడు జయశంకర్ సార్ గారి ఫోటో ను మాత్రమే పెట్టాం.
  • నేను నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలిచిన తర్వాతనే కేసీఆర్ గారి ఫోటోను జాగృతి కార్యక్రమాల్లో పెట్టుకున్నాం. ఇప్పుడు నేను ఆ పార్టీలో లేను
  • అందుకే నా తరఫున క్లారిటీ ఇస్తున్నా. నా దారిలో నేను వెళ్తుండగా ఆయన ఫోటో పెట్టుకోవటం నైతికంగా సరికాదు.
  • నేను జనం ఏం చెబుతారో వినాలనే జనం బాట కార్యక్రమం చేపడుతున్నా.
  • తెలంగాణ వస్తే ఏం కావాలని ప్రజలు కోరుకున్నారో… ఏం జరిగిందో, ఏం జరగాలని కోరుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నా.
  • కేసీఆర్ గారికి జాగృతి, బీఆర్ఎస్ రెండు కళ్ల మాదిరిగా ఉన్నాం.
  • కానీ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశాక ఆయన ఫోటో పెట్టుకుంటే బీఆర్ఎస్ సోషల్ మీడియానే ట్రోల్ చేస్తుంది.
  • దారులు వేరైనప్పుడు ధైర్యం ఉండాలి. అందుకే నా దారిలో నేను వెళ్తున్నా.
  • రాజకీయంగా తెలంగాణలో స్పేస్ ఉందో లేదో నాకు తెలియదు.
  • ప్రజలనే అడిగి వారు చెప్పినట్లు వింటాం. అందుకే ప్రతి జిల్లాలో రెండు రోజులు ఉంటాం.
  • సమగ్రమైన అధ్యయనం కోసం తెలంగాణ అంతటా తిరుగుతాం.
  • మరోవైపు సమస్యలపై పోరాటం కూడా కొనసాగిస్తాం.
  • గ్రూప్-1, బనకరచర్ల, బీసీ రిజర్వేషన్లు, ముంపు గ్రామాల అంశాలపై పోరాటం కొనసాగిస్తాం.
  • జాగృతిని స్ట్రాంగ్ చేసుకుంటాం. గతంలో మా సంస్థ పటిష్టంగా ఉండేది. సార్ (కేసీఆర్ గారు) చెప్పారని గతంలో కొన్ని కార్యక్రమాలు ఆపటం జరిగింది.
  • ఇప్పుడు సంస్థను పటిష్టం చేసుకుంటాం. మళ్లీ కొత్త వారిని రిక్రూట్ చేసుకుంటాం.
  • పార్టీనే వద్దనుకున్నాక ఎమ్మెల్సీ పదవి మీద వ్యామోహం లేదు.
  • నా రాజీనామా యాక్సెప్ట్ చేయకపోవటానికి కాంగ్రెస్ రాజకీయమేమిటో తెలియటం లేదు.
  • నా రాజీనామా ఆమోదిస్తే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆమోదించడం లేదేమో.
  • బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇస్తే మనకు రెండు బడ్జెట్ లలో 8 కొత్తలు కూడా ఇవ్వలేదు.
  • బీసీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిన వారే… గవర్నర్, రాష్ట్రపతి వద్ద బిల్లును ఆపారు.పైగా ఎన్నికలను ఆపేస్తామంటూ బీజేపీ వాళ్లే బెదిరిస్తున్నారు.
  • ఇక కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల వైఫల్యం చెందింది. ప్రతిచోట పోరాటం చేయాల్సి వస్తోంది.
  • జాతీయ పార్టీలు వైఫల్యం చెందాయి. బీఆర్ఎస్ నన్ను సస్పెండ్ చేసింది.
  • అందుకే ప్రజల దగ్గరకు వెళ్లి వాళ్లు చెప్పే మాటలు వినాలని నిర్ణయించుకున్నా.
  • వాళ్లు చెప్పిన దాన్ని నుంచి ఏం చేయాలన్న ఒక సొలుష్యన్ వస్తుంది.
  • జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాకు చిన్న విషయం. మాకు తెలంగాణ అనేదే పెద్ద అంశం.
  • అక్టోబర్ 25 నుంచి నిజామాబాద్ నుంచి జాగృతి జనం బాట ప్రారంభం కానుంది అని అన్నారు.
Please follow and like us:
Pin Share