
విశాఖపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ మద్యం కేసుపై తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. తనను రాజకీయంగా ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు.
జోగి రమేష్ మాట్లాడుతూ –
“నన్ను మద్యం కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. మద్యం స్కాంను బట్టబయలు చేసింది మా పార్టీనే. నకిలీ మద్యం స్కాం చంద్రబాబుకు చుట్టుకుంది. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేసి మద్యం వ్యవహారాన్ని వేరే వాళ్లపై మోపాలని చూస్తున్నారు,” అన్నారు.
అదేవిధంగా, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వమే ఇళ్లకే మద్యం డోర్ డెలివరీ చేస్తోంది అని ఆరోపించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రతిపక్షాలపై ఆరోపణల పర్వం నడుస్తోందని వ్యాఖ్యానించారు.
🔹 ప్రధానాంశాలు:
“నన్ను మద్యం కేసులో ఇరికించే కుట్ర” – జోగి రమేష్
“మద్యం స్కాం చంద్రబాబుకు చుట్టుకుంది”
“డైవర్షన్ పాలిటిక్స్‌తో నిజాలను దాచే ప్రయత్నం”
“ఇళ్లకు మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు”
ఈ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో మద్యం కేసుపై మళ్లీ చర్చ మొదలైంది.

